UPDATES  

 గుంటూరు కారం థర్డ్ సాంగ్ ప్రోమో …

త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా షూటింగ్ గురువారం (డిసెంబర్ 28)తో పూర్తయినట్లు తెలుస్తోంది. టైటిల్ తోనే పక్కా మాస్ సినిమా అని చెప్పిన త్రివిక్రమ్.. మిల్క్ బాయ్ లా ఉండే మహేష్ ను పూర్తి మాస్ రోల్ లో చూపించనున్నారు. మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు విడుదల చేయగా.. రెండు డిఫరెంట్ గానే ఉన్నాయి.

 

ఫస్ట్ సాంగ్ పక్కా మాస్ బీట్ తో, సెకండ్ సాంగ్ లవ్ బీట్ తో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. ముచ్చటగా మూడో పాటను మరో మాస్ బీట్ తో రెడీ చేశారు. “కుర్చీ మడతపెట్టి” అనే ట్రెండింగ్ డైలాగ్ తోనే పాట రాశారు రామజోగయ్య శాస్త్రి. ఈ సాంగ్ ప్రోమోను మహేష్ రిలీజ్ చేశారు. పూర్తి పాటను న్యూ ఇయర్ గిఫ్ట్ గా డిసెంబర్ 30న విడుదల చేయనున్నారు.

 

చిన్న ప్రోమో సాంగ్ లోనే మహేష్ – శ్రీలీల మాస్ డాన్స్ అదిరిపోయింది. థియేటర్లలో ఈ పాటకు కుర్చీలు నిజంగానే విరిగిపోతాయేమో అంటున్నారు మహేష్ ఫ్యాన్స్. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమాను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది.

 

కాగా.. సినిమాకు సినిమాకు మధ్య ఒక వెకేషన్ కు వెళ్తారు మహేష్. గుంటూరు కారం షూటింగ్ పూర్తవ్వగానే.. ఒక యాడ్ షూటింగ్ కోసం మహేష్ దుబాయ్ కు బయల్దేరారు. యాడ్ షూట్ అవ్వగానే.. ఫ్యామిలీతో కలిసి ఒక చిన్న వెకేషన్ కూడా ప్లాన్ చేశారట. ఒకట్రెండు రోజులు అక్కడే వెకేషన్ ఎంజాయ్ చేయనున్నట్లు తెలుస్తోంది. భార్య, పిల్లలతో కలిసి మహేష్ దుబాయ్ కు పయనమైన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !