UPDATES  

 నింగిలోకి దూసుకెళ్లనున్న ఎక్స్‌ పో రాకెట్..

న్యూ ఇయర్‌ వేళ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. అంతరిక్ష అధ్యయంలో భాగంగా జనవరి 1న ఉదయం 9 గంటల 10 నిమిషాలకు శ్రీహరి కోట నుంచి ఎక్స్‌ పో రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ వంటి వివిధ ఖగోళ వస్తువుల నుంచి వెలువడుతున్న.. అత్యంత తీక్షణమైన X-కిరణాల అధ్యయనానికి మొట్టమొదటిసారిగా పోలారిమెట్రి మిషన్‌ ఇస్రో చేపడుతోంది.

 

PSLV-C 58 వాహన నౌక ద్వారా ఎక్స్‌పో శాట్‌ శాటిలైన్‌ను నింగిలోకి పంపనుంది. శాటిలైట్‌ను భూమికి 500 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈ రాకెట్‌ కనీసం ఐదేళ్లపాటు పని చేసేలా రూపొందింనట్టు తెలిపింది. రాకెట్ రేపు నింగిలోకి దూసుకెళ్లనుండగా ఇవాళ కౌంట్‌డన్‌ ప్రారంభంకానుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !