UPDATES  

 దొరికింది కొండంత పట్టింది గోరంత..వాజేడు లో దొరికిన గంజాయి పై కుండ బద్దలు కొట్టిన సుప్రీంకోర్టు లాయర్ పిట్ట శ్రీనివాస్ రెడ్డి..

  • దొరికింది కొండంత పట్టింది గోరంత.
  •  వాజేడు లో దొరికిన గంజాయి పై కుండ బద్దలు కొట్టిన సుప్రీంకోర్టు లాయర్ పిట్ట శ్రీనివాస్ రెడ్డి.
  •  సరుకంతా జమీందారు వంశీలదే అంటున్న పిట్ట.

 

మన్యం న్యూస్. నూగూర్ వెంకటాపురం.

నాలుగు రోజుల క్రితం వాజేడు మండలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న నాలుగు కేజీల గంజాయి పై ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్ పిట్ట శ్రీనివాస్ రెడ్డి హాస్యస్పదంగా స్పందించారు. దొరికింది లారీ సరుకైతే నాలుగు కేజీలు దొరికింది అని అధికారులు సైతం కేసును ఎందుకు తప్పు దోవ పట్టిస్తున్నారో అర్థం అవ్వడం లేదు అని వారన్నారు. ఒకవేళ నాలుగు కేజీల గంజాయి దొరికితే ఆ గంజాయిని విక్రయించడానికి ఒక కారు ఐదు బైకులు ఎందుకు ఉన్నాయో చెప్పాలని .15 మంది ఆ నాలుగు కేజీల గంజాయిని ఎలా తీసుకొస్తారు అని ఎద్దేవా చేశారు.అంతేకాకుండా ఇంకా పరారీలో ఐదుగురు ఉన్నట్టుగా చెబుతున్న అధికారులు గంజాయి దొరికిన నాలుగు రోజులైనా ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదని వారు ప్రశ్నించారు.ఇదంతా జమిందార్ వంశీయులను తప్పించే విధంగా మూకుమ్మడి డ్రామాకు అధికారులు సైతం కొమ్ము కాస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. . ఈ గంజాయి తరలింపులో ప్రముఖ పార్టీకి చెందిన ఒక అధ్యక్షుడు కూడా ఉన్నాడు అంటూ, ఆ గంజాయి తరలించిన లారీ తనదే అంటూ తన అనుమానాన్ని తెలిపారు.

ప్రజల సమస్యలకు వెన్నెముకగా ఉండాల్సిన అధికారులే ఇటువంటి జమీందారు వంశీయులకు కొమ్ము కాయడం ఏంటి అని, అధికారులే జమిందార్ వంశీలకు భయపడితే ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుంది అని వారన్నారు., ఏజెన్సీలో యువకులు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న ఈ తరుణంలో స్థానికంగా ఉన్న అధికారులే పరోక్షంగా గంజాయి కేసుల్ని తప్పుతో వ పట్టిస్తే పల్లెలోని యువకులు ఏం నేర్చుకోవాలో చెప్పాలి అని మండిపడ్డారు . ఈ విషయాలు పట్ల మండల ప్రజలు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం గంజాయి పై ఉక్కు పాదం మోపుతున్న ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న అధికారులే జమిందార్ వంశీలకు చెందిన వారికి దాసోహం అయ్యి. యువకులను జమిందార్ వంశీలకు బదులుగా గంజాయి కేసులో వాడి వాళ్ళ జీవితాలను ఖరాబు చేస్తూ ఇంకా వారి బతుకులు చీకట్లోనే మగ్గిపోయేలా జమిందార్ హయాంలో చేసినట్టుగా చేసే ప్రక్రియ సిగ్గుచేటు అని అన్నారు. ఈ గంజాయి కేసు లో ఒక పార్టీకి చెందిన ప్రముఖుల వల్లనే ఇదంతా దందా జరుగుతుంది అని. సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయిని పులి చర్మాలను వాటి గోర్లను సైతం వీరందరి గుప్పెట్లో ఉంచుకొని వివిధ గ్రామాల యువకులే టార్గెట్ గా చేసుకొని పల్లెలను నాశనం చేసే విధంగా చేస్తున్న చర్యలు చూస్తుంటే పల్లెలలో రాను రాను విద్యార్థులు కరువైపోతారు అని. ఇది ముందు తరాలకు మంచిది కాదు. అంటూ ఈ విషయాలు పట్ల పై అధికారులు జోక్యం చేసుకొని ఈ గంజాయి పై లోతైన ఇన్వెస్టిగేషన్ చేసి పల్లెలో నుంచి ఈ గంజాయిని మరియు ముడుపులకు తలోగ్గిన అధికారుల పై చర్యలు చేపట్టాలని పత్రికాముఖంగా కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !