మన్యం న్యూస్, మంగపేట.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంగపేట మండల నాయకురాలు పొలాసాని సరళ రాణి ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందుగా మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ప్రజారంజక పాలన అందించటంలో ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,పంచాయతీ రాజ్ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేసే కృషి అద్భుతం అని ఆమె అన్నారు.అలాగే రాబోయే రోజుల్లో సీతక్క ములుగు జిల్లా ను అభివృద్ధి పథంలో నడిపిస్తుంది అని సరళ రాణి అన్నారు.ప్రభుత్వం ఇచ్చే ఆరు గ్యారెంటిలు ప్రజలకు ఆరు వరాలు ఇటువంటి అద్భుతమైన అవకాశాలు ప్రతి ఒక్కరు తప్పకుండ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వడ్లకొండ బాను,కవిత,రజిని,రేణుక,వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.