తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ‘మానాడు’ ఫేమ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ సినిమా చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ఇప్పుడు టైటిల్ ఖరారైంది. అలాగే ఫస్ట్ లుక్‍ను కూడా ఆదివారం రిలీజ్ చేసింది మూవీ యూనిట్. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంలో దళపతి విజయ్ అభిమానులకు కానుకగా మూవీ యూనిట్ ‘దళపతి 68 టైటిల్’ను రివీల్ చేసింది. ఈ చిత్రానికి ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT) అనే టైటిల్‍ను ఖరారు చేసింది.
