- పినపాక మండలం లో కుక్కలకు వింత జబ్బు
- కుక్కలకు విపరీతమైన గజ్జి
- భయంకరంగా దర్శనమిస్తున్న వీధి కుక్కలు
- సంవత్సరం క్రితం ఒక కుక్కకి-నేడు పలు కుక్కలకు సోకిన వ్యాధి
- జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని జంతు ప్రేమికుల వేడుకోలు
మన్యం న్యూస్ , పినపాక:
పినపాక మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలు గజ్జి బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. సంవత్సరం క్రితం ఒక కుక్క ఈ విధంగా కనిపించగా ప్రస్తుతం ఆరేడు కుక్కల కు ఈ గజ్జి వ్యాపించి భయంకరంగా రోడ్లమీద తిరుగుతున్నాయి. వాటిని చూసిన వాహనదారులు, పాదాచారులు, చిన్న పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నానాటికి వీటి సంఖ్య పెరగడం ఇండ్లలో సైతం తిరగడంతో ప్రజలకు పిల్లలకు ఏ వ్యాధి సోకునొనని భయభ్రాంతులకు గురవుతున్నారు. మరిన్ని వీధి కుక్కలకు ఈ దుస్థితి తలెత్తకుండా జిల్లా కలెక్టర్ దృష్టిసారించి కుక్కల వ్యాధి నివారణకు కృషి చేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.