మన్యం న్యూస్ మంగపేట.
మంగపేట మండలం రాజుపేట గ్రామంలో గుడుంబా అమ్మకాలు యదేచ్చగా కొనసాగుతున్నవి.పక్క జిల్లా నుండి గుడుంబా కాసి రాజుపేట దళిత వాడలకు సరఫరా చేస్తున్నారు. ఇక్కడ ఉన్న కొంతమంది పేద ప్రజలను లక్ష్యం గా చేసుకొని గుడుంబా విక్రయిస్తున్నారు. ధర తక్కువ కిక్కు ఎక్కువ ఉండటం తో ఎక్కువ ఉండటం తో యువత, గుడుంబా కు ఆకర్షితులు అవుతున్నారు.మంగపేట మండలం లో మద్యం దుకాణలకు పర్మిషన్ లేకపోయినా కూడా మద్యం మండలం లో ఎక్కువ ధరకు ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ రేటుకు దొరుకుతుంది,ఎక్కువ అంత ధర పెట్టలేని సామాన్య ప్రజానీకం యువత గుడుంబా కు అలవాటు పడి పట్టపగలే తాగి రోడ్ల మీద పడుకుంటున్నారు. రాజుపేటదళిత వాడలో గుడుంబా విక్రయిస్తున్న కొంతమంది విక్రయ దారులు పోటీ పడి గుడుంబా త్రాగే వారికీ స్టఫ్ ఫ్రీ అని ప్రజలను ఆకర్షిస్తూ వారిని త్రాగుబోతులు గా మారుస్తున్నారు. ఇటువంటి హానికరం అయినా మత్తు పానీయం గుడుంబా త్రాగిన వారికీ చాలా మందికి అనారోగ్యం, టీబీ, మూర్ఛ వ్యాధి లాంటి అనారోగ్యాలతో కున్నారిళ్లుతున్నారు.ఇందులో ముఖ్యం గా యువత మత్తుకు చిత్తు అవుతున్నారు. ముఖ్యం గా రెక్కడితే గాని డొక్కాడని పేద దళిత , గిరిజన వాడల్లోని ప్రజల ఆరోగ్యం గుడుంబా మహమ్మారి తో క్షీణించి ఏ పని చేయలేక చిన్న వయసులోనే తనువు చాలిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఇకనైనా కళ్ళు తెరిచి గుడుంబా ను అరికట్టి ప్రజల ఆరోగ్యం కాపాడాల్సినది గా గ్రామస్థులు కోరుతున్నారు.