ప్రిన్స్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిందా పడింది. మళ్లీ ఎప్పుడు నిర్మహిస్తారనేది తర్వాత ప్రకటిస్తామని మూవీ నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఈనెల 6న నిర్వహించేందుకు మేకర్స్ ఫ్లాన్ చేశారు. అయితే భద్రతా కారణాల వల్ల ఈ వేడుక వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ మూవీ ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
