పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ‘కల్కి2898ఏడీ’ మూవీ తెరకెక్కుతోంది. తాజా టాక్ ప్రకారం ఈ చిత్రంలో గ్లామరస్ బ్యూటీ దిశా పటానీ తెలుగు అమ్మాయిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే అభిమానులకు మాత్రం పండగే అని చెప్పొచ్చు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.