ఇటీవల విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కోట బొమ్మాళి పీఎస్’ మంచి హిట్ అందుకుంది. శ్రీకాంత్, శివాని, రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు యువ దర్శకుడు తేజ మర్ని తెరకెక్కించాడు. తాజాగా మేకర్స్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ఈ నెల 11న స్ట్రీమింగ్ కానుంది.
