దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ బాంబే విద్యార్థులకు జాక్‌పాట్ తగిలింది. 85 మంది విద్యార్థులు రూ.కోటి కంటే ఎక్కువ వార్షిక వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 2023-24 రిక్రూట్‌మెంట్ సీజన్ యొక్క ఫేజ్-1లో భాగంగా ఈ ప్యాకేజీలు స్వీకరించబడ్డాయి. ఐఐటీ నిర్వహించిన రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో విదేశాలకు చెందిన 388 కంపెనీలు పాల్గొన్నాయి. మొత్తం 1340 మంది విద్యార్థులు హాజరుకాగా.. 1188 మంది విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించారు