తిరుమలలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. జనవరి 15వ తేదీన ‘శ్రీ గోదా కళ్యాణం’ జరుగుతుందని తెలిపారు. జనవరి 16న కనుమ పండగ సందర్భంగా శ్రీవారి పార్వేట ఉత్సవం, జనవరి 25న శ్రీరామకృష్ణతీర్థ ముక్కోటి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జనవరి 22న అయోధ్యకు లక్ష శ్రీవారి లడ్డూలు పంపనున్నట్లు చెప్పారు.