UPDATES  

 ‘యాత్ర-2’ టీజర్ రిలీజ్..

దర్శకుడు మహి వి రాఘవ ప్రస్తుతం ‘యాత్ర-2’ మూవీ తీస్తున్నాడు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిగా మమ్ముట్టి నటిస్తుండగా.. ఆయన కొడుకు వై.ఎస్.జగన్‌గా జీవా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలనే క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

 

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి).. కొడుకుగా వై.ఎస్.జగన్ (జీవా) రాజకీయాల్లోకి రావటానికి గల కారణమేంటనే అంశాన్ని చిన్న ఎమోషనల్ సన్నివేశంతో చూపించారు. తండ్రి లాంటి నాయకుడిని కోల్పోయినప్పుడు వారిని ఓదార్చటానికి ఓదార్పు యాత్ర చేద్దామంటే.. నాటి రాజకీయ నాయకులు ఎలాంటి అడ్డంకులు సృష్టించారనే విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు.

 

అంతేకాకుండా ఈ టీజర్‌లో గూస్ బంప్స్ తెప్పించే సీన్లు ఓ రేంజ్‌లో ప్రేక్షకులను, జగన్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానె బెర్నెర్ట్, వై.ఎస్.భారతి పాత్రలో కేతకి నారాయణన్ నటించారు. ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !