UPDATES  

 రాజుపేట ను మండలం చేయండి …రాజుపేటలో ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేయండి..ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి

 

మన్యం న్యూస్, మంగపేట

ఎప్పటినుండో ప్రజల చిరకాల కోరిక రాజుపేటను మండలం చేయాలి,

రాజుపేట ను కేంద్రంగా చేసుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాల తక్షణమే ఏర్పాటు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా కార్యదర్శి తోకల రవి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా కార్యదర్శి టి ఎల్ రవి మాట్లాడుతూ మండలంలోని మంగంపేట మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఉండడంతో మండల విద్యార్థులు మంగపేట పోయి రావాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. కళాశాల సమయంలో ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రవేటు వాహనాలలో అధిక ఛార్జీలు పెట్టి పేద మధ్య తరగతి విద్యార్థులు మంగపేట కళాశాలకు వెళ్లలేకపోతున్నారు పోతున్నారని అన్నారు.. రాజపేట కేంద్రంగా చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీలు. రమణక్కపేట. కత్తి గూడెం. బ్రాహ్మణపల్లి. దోమాడ. నిమ్మ గూడెం. రామచంద్రుని పేట. వాడ గూడెం. పంచాయతీ పరిధిలోని 20 గ్రామాలకు పైగా ప్రజలు విద్యార్థులు విద్యను వినియోగించుకోలేక పోతున్నారని తక్షణమే ప్రజల సౌకర్యం రాజుపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !