- ధాన్యం, పత్తి అమ్ముతున్నరా….జర జాగర్త
- గిరిజన రైతులే వారి టార్గెట్,
- కొత్త టెక్నాలజీ ఉపయోగించి పత్తి కొనుగోలులో మోసం చేస్తున్న వ్యాపారస్తులు…
మన్యం న్యూస్ చర్ల;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలలోని గిరిజన గ్రామంను టార్గెట్ గా చేసుకొని కొంతమంది పత్తి ధాన్యం వ్యాపారస్తులు ఇతర ప్రాంతాల నుంచి వెహికల్స్ వేసుకొని ఇక్కడ గిరిజన గ్రామాలకు తిరుగుతూ మోసపూత కాటతో పత్తి, ధాన్యం కొనుగులును చేస్తున్నారు. ఆరుగాలం వెండనక వానక కష్టించి పండించిన పంటను సాగు చేసిన రైతులు చివరిలో దళారి చేతిలో మోసపోతున్నారు. వర్షాభావం సాగునీటి వనరులు అంతంత మాత్రమే ఉన్న గాని అన్నదాతలు కష్టాలు నడుమ పంటను సాగు చేస్తున్నారు. రైతు కష్టానికి తగ్గట్టుగా పంట దిగుబడి అంతంత మాత్రమే వస్తుంది. మంచి ధరతో పంటను అమ్ముకోవచ్చు అని భావించిన రైతును దళారులు అడుగడుగునా దగా చేస్తున్నారు. ధాన్యం సంచి పేరుతో తూకం లో రెండు కేజీలు, లాభం పేరుతో కేజీ ధాన్యమును తీస్తున్నారు. ఇలా 100 కేజీలకు దాదాపుగా 5 కేజీల వరకు వ్యాపారులు లెక్క కడుతూ ధాన్యాన్ని తీసేస్తున్నారు. ఒక రైతు నుంచి 50 క్వింటల వరి ధాన్యం సేకరిస్తే అందులో నుంచి సంచుల లాభం పేరుతో 50 కేజీల వరకు తూకం నుంచి తీసేస్తున్నారు. సాధారణంగా ఒక సంచి బరువు రెండు కేజీలు ఉండదు అని రైతులు వాపోతున్నారు. వ్యాపారులు మాత్రం దానికే లెక్క కడుతున్నారు. దీనివలన 100 కేజీలకు దాదాపుగా 5 కేజీల వరకు రైతు నష్టపోవాల్సి వస్తుంది. ఈ విధంగా సంచుల పేరుతో అమాయకమైన గిరిజన రైతులను మోసం చేస్తున్నారు.
పెట్టుబడి పేరుతో పంట కొనుగోలు…
రైతులకు వ్యవసాయ నిమిత్తం అవసరమైన మందులను కొంతమంది దళారులు ముందుగానే ఆ రైతులకు అందిస్తున్నారు. అనంతరం రైతులకు పంట చేతికి వచ్చాక ఆ పంటను తమకే అమ్మాలి అని తాము నిర్ణయించిన ధరకే పంటను కొనుగోలు చేస్తామని రైతులపై హుకుం జారీ చేస్తున్నారు. వ్యాపారులు పంట కొనుగోలు తర్వాత రైతులకు డబ్బులు కూడా ఇవ్వడం లేదునీ, అప్పుగానే రైతుల నుంచి పెట్టుబడి పెట్టిన డబ్బుపై అధిక వడ్డీ కట్టించుకుంటూ తమ ఖాతాలో జమ చేసుకుంటున్నారు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనితో రైతులు తమ తమ పంటను పండించి అమ్మివేసిన, డబ్బులను మాత్రం కళ్ళచూడని పరిస్థితి. కొంతమంది వ్యాపారులు రైతులు వద్ద నుంచి ఈ రకమైన పన్నాగం పన్ని వడ్డీ పేరుతో వారి పంటను దళారులే చెప్పిందే దరగా తూచిందే తూకంగా రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు.
పత్తి కొనుగోలులో కొత్త టెక్నాలజీ ఉపయోగించి మోసం….
వేరే ప్రాంతాల నుంచి పత్తి కొనుగోలు చేస్తామంటూ కొంతమంది వ్యాపారస్తులు అమాయకమైన గిరిజన గ్రామాల్ని టార్గెట్ గా చేసుకుంటున్నారు. ఒక కింటా పై తక్షణమే అధిక ధర ఇస్తామంటూ గ్రామాల్లో తిరుగుతూ వారు తెచ్చిన మోసపూరితమైన ఎలక్ట్రానిక్ కాటాల ద్వారా గిరిజనులను మోసం చేస్తున్నారు. పత్తి కాటా వేసే సమయంలో తమ వద్ద ఉన్న ఎలక్ట్రిక్ కాటాకు అనుసంధానమైన సెల్ ఫోన్ లో ఉన్న రిమోట్ సహాయంతో బరువును తగ్గిస్తూ కొత్త రకమైన మోసాలను గిరిజన రైతులపై చేస్తున్నారు. ఇదే క్రమంలో మండల పరిధిలోని దోసినపల్లి గ్రామంలో గిరిజన రైతుకు చెందిన ఐదు కింటాల పత్తిని వారు తెచ్చిన ఎలక్ట్రిక్ కాటాలో నాలుగు కింటలుగా తూచారు. ఆ గిరిజన రైతు ముందుగానే తమ పంటను ఐదు కింటలుగా తూచి ఉంచుకోగా నాలుగు క్వింటాలే రావడంతో ఈ మోసాన్ని పసిగట్టిన రైతు ఆపరేటింగ్ చేస్తున్న దళారి వద్ద ఉన్న సెల్ ఫోన్ చూపించమని అడగగా ఆ వ్యాపారి అక్కడ నుంచి పరారైనట్లుగా రైతులు తెలిపారు.
ఇప్పటికైనా స్థానిక అధికారులు స్పందించి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఈ విధంగా రైతులను మోసం చేస్తున్న పత్తి, ధాన్యం వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకొని తమ పండించిన పంటను మంచి ధరకు కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలంటూ గిరిజన రైతులు వాపోతున్నారు.