UPDATES  

 ‘ఓజీ’ నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే..

పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న మూవీ ‘ఓజీ’. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీపై అందరిలోనూ మంచి అంచనాలే ఉన్నాయి. ఇందులో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి, ప్రకాశ్‌ రాజ్‌ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో భాగంగా ఇటీవల ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేయగా.. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

 

ఇదిలా ఉంటే ఇందులో నటిస్తున్న నటుడు వెంకట్ తాజాగా ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అతడు చెప్పిన మాటలకు సినిమాపై మరింత బజ్ ఏర్పడింది. ‘‘పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘ఓజీ’ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాను. ‘అన్నయ్య’(చిరంజీవి సినిమా) టైమ్ నుంచే పవన్‌తో పరిచయం ఉంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత కలిసి పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పవన్ అభిమానులకు ఈ సినిమా విందు భోజనం కానుంది. ఇందులో చాలామంది నటీనటులు ఉన్నారు. టాలీవుడ్‌లో ఇదొక ట్రెండ్ సెట్టింగ్ మూవీ’’ అంటూ తెలిపారు. దీంతో ఈ నటుడి మాటలతో మెగా అభిమానుల్లో ఫుల్ జోష్ మొదలైంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !