కేంద్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. ఇళ్లు, భవనాల పైకప్పులు, ఖాళీ స్థలాలపై సోలార్ పవర్ ప్యానెళ్లను అమర్చుకునే వారికి ఇచ్చే సబ్సిడీని కేంద్రం భారీగా పెంచింది. ఇప్పటి వరకు కిలో వాట్‌కు రూ. 14,400 చొప్పున ఇచ్చారు. ఇక నుంచి రూ. 18,000 అందించనుంది . 3 కిలోవాట్లకు 40 శాతం లేదా గరిష్టంగా రూ.54 వేలు, 4-10 కిలోవాట్లకు కిలోవాట్‌కు రూ.9 వేలు (ఇంతకుముందు రూ. 7,200) ఇవ్వనున్నట్లు పేర్కొంది.