మన్యం న్యూస్ గుండాల: జనవరి 10 వ తారీకు తో పెండింగ్ చలానా పై రాయితీతో కూడిన సమయ ముగుస్తున్నందున వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్ వాహనదారులను కోరారు. మరో రెండు రోజుల్లో గడువు ముగుస్తుందని భారీ మొత్తంలో చలాన్లపై రాయితీని ఇచ్చినందున ఇలాంటి అవకాశాన్ని వాహనదారులందరూ ఉపయోగించుకొని పెండింగ్ చలానాలను కట్టాలని ఆయన కోరారు. అవకాశం ముగిసిన తర్వాత ఎంత చలానా ఉందో అంత కట్టాల్సి ఉంటుందని ఆయన అన్నారు