మన్యం న్యూస్ గుండాల: మండల కేంద్రంలోని గడపగడపకు అయోధ్య రామునికి అక్షింతలను గుండాల మండల కేంద్రంలోని శ్రీరామ భక్తులు మండల కేంద్రంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ అక్షింతలను అందించారు. గతవారం అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను మండల కేంద్రంలో ఊరేగించి వాటిని ఈరోజు గ్రామంలోని ప్రతి ఇంటికి అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు మానాల వెంకటేశ్వర్లు, గుండాల ఉపసర్పంచ్ మానాల ఉపేందర్, ధర్మ జాగరణ సమితి అధ్యక్షులు యాసారపు రవి, మానాల శ్రవణ్ కుమార్, సోలం సతీష్, వెంకటేశ్వర్లు, మానాల ప్రణీత్ కుమార్, గడ్డం రామకృష్ణ, గడ్డం సాయి, పిల్లి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు
