సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని UA సర్టిఫికెట్ పొందింది. ఈ మేరకు మేకర్స్ ప్రకటించారు. అలాగే తాజాగా ఈ సినిమా అఫీషియల్ రన్ టైం 159 నిమిషాలుగా (2:39 గంటలు) వెల్లడించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ జనవరి 12న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకి రానుంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
