కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన ‘అయలాన్’ మూవీ జనవరి 12న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే తెలుగు వెర్షన్ ప్రస్తుతానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సినిమాకి సంబంధించిన నైజాం, ఉత్తరాంధ్ర ప్రాంతాల డిస్ట్రిబ్యూట్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు.
