UPDATES  

 ‘దేవర’ గ్లింప్స్ వచ్చేసింది.. చితక్కొట్టేసిన ఎన్టీఆర్..!

ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. పాన్ ఇండియా లెవెల్లో సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి ఈ సినిమా నుంచి గ్లింప్స్ వస్తోంది అంటే ఇంకెంత ఆసక్తి వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ఆసక్తికి తాజా తెర పడింది.

 

ఎంతగానో ఎదురుచూస్తోన్న దేవర గ్లింప్స్ వచ్చేసింది. ఇందులో ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త పాత్రలో ఎన్టీఆర్‌ దర్శనమిచ్చారు. స్టార్టింగ్ స్టార్టింగే సముద్రపు సన్నివేశాలను చూపించి సినిమాపై అంచనాలు పెంచేశారు. ఆ సీన్లలో ఎన్టీఆర్ మాస్ లుక్.. యాక్షన్ సీన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయనే చెప్పాలి. ఆ యాక్షన్ సీన్‌లో చాలా మంది విలన్లను ఎన్టీఆర్ చితక్కొట్టిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !