భారత క్రికెట్ జట్టుకు కొత్త స్పాన్సర్లు వచ్చేశారు. బీసీసీఐ తాజాగా ఈ వివరాలను వెల్లడించింది. ఇక నుంచి భారత క్రికెట్ జట్టు అధికారిక భాగస్వాములుగా కాంపా, ఆటంబర్గ్ టెక్నాలజీస్ ఉండనున్నాయి. 2024-26 కాలానికి ఇవి స్పాన్సర్లుగా వ్యవహరించనున్నాయి. త్వరలో ఈ సంస్థల జెర్సీలను విడుదల చేయనున్నారు. కాగా ఇప్పటివరకు టీమిండియాకు డ్రీమ్ 11 స్పాన్సర్‌గా ఉంది.
