మన్యం న్యూస్ గుండాల: మండలంలోని ట్రాక్టర్ యజమానులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని గుండాల ఎస్ఐ కిన్నెర రాజశేఖర్ పేర్కొన్నారు. ప్రతి ట్రాక్టర్ ట్రాలీ వెనక భాగంలో రేడియం స్టిక్కర్స్ తప్పనిసరిగా వేయాలని అన్నారు. స్టిక్కర్స్ అందించడం ద్వారా వెనక నుండి వచ్చే వాహనాలకు స్పష్టంగా కనబడుతుందని అన్నారు దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకొనబడతాయని ఆయన అన్నారు
