మన్యం న్యూస్ గుండాల: మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు బుధవారం వనభోజనాల సందడి చేశారు. స్థానిక కిన్నెరసాని సమీపంలో విద్యార్థిని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు సైతం హాజరై వనభోజనాలు చేసి అనంతరం ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నారాయణమ్మ, మంజుల, రాజ్యలక్ష్మి, స్థానిక ఫోటోగ్రాఫర్ నరేష్, సుహాసిని తదితరులు పాల్గొన్నారు
