అరేబియా సముద్రంలో హృదయాకార ద్వీపం ఉంది. ఈ ద్వీపం కింద పెద్ద గుహ ఉందని పురాణాలు చెబుతున్నాయి. అహిరావణ నుంచి శ్రీరాముడు, లక్ష్మణుడిని కాపాడేందుకు హనుమంతుడు ఈ గుహ ద్వారా పాతాళానికి వెళ్లాడట. హనుమంతుడు ఈ ద్వీపంపై కొద్ది రోజులు గడిపాడని.. ఆ సమయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించి హనుమంతుడు పూజించాడట. ఈ ద్వీపం పేరు నేత్రాని. ప్రజలు ఇప్పటికీ ఇక్కడికి వెళ్లి శ్రీరాముడు, హనుమంతుడిని పూజిస్తారు.
