మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా మహేశ్ కెరీర్‌లోనే హైయెస్ట్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. నైజాంలో రూ.42 కోట్లు, సీడెడ్‌లో రూ.13.75 కోట్లు, ఆంధ్రాలో రూ.47.25 కోట్లు.. తెలంగాణ, ఏపీలో కలిపి రూ.103 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా రూ.132 కోట్లకు బిజినెస్ చేసినట్లు అంచనా.
