మన్యం న్యూస్ కరకగూడెం: మండలంలోని భట్టుపల్లి గ్రామంలో తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్, కార్మికశాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ బోంత.సాంబశివరావు ఆదేశాల మెరకు కరకగూడెం మండల అధ్యక్షులు శివరాత్రి మదు ఆధ్వర్యంలో, పినపాక నియోజకవర్గ సోషల్ మీడియా అండ్ కార్మిక శాఖ అధ్యక్షుడు సూర సంతోష్, అధ్యక్షతన మండలంలోని బట్టుపల్లి గ్రామంలో, స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 217వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్, మండల అధ్యక్షులు శివరాత్రి మధు మాట్లాడుతూ వడ్డెర కులస్తులను ST జాబితాలో చేర్చాలని అనేక విధాలుగా కుల అభివృద్ధి వడ్డెరను ఏళ్ల తరబడి జీవిస్తున్న వారిని ఆర్థికంగా గాని ,సామాజికంగా, గాని ఏళ్ల తరబడి జీవనం కోన సాగిస్తున్నారు గత ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లిన ప్రభుత్వాలు మా వడ్డెర కులస్తులను పట్టించుకున్న దాఖలు లేవన్నారు. ఇప్పటిి ప్రభుత్వాలు, ఆర్థికంగా వెనుకబడిన మావడ్డెర కులస్తులు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు సూర ఉప్పలయ్య,గిరిశెట్టి మల్లయ్య, గిరిశెట్టి బుచ్చయ్య, బొంతవెంకన్న మండల యూత్ అధ్యక్షుడు బొంత సాగర్, శివరాత్రి సతీష్,కుంచo వినోద్, శివరాత్రి సాగర్, గిరిశెట్టి సతీష్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ గిరిశెట్టి కృష్ణారావు గ్రామ పెద్ద మనుషులు పాల్గొనడం జరిగింది.