గుజరాత్‌లోని గాంధీనగర్‌లో అంతర్జాతీయ అంతరిక్ష సదస్సు జరుగుతోంది. ఆ సమావేశంలో ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ 2035 నాటికి అంతరిక్ష కేంద్రం నిర్మించాలని, భారతీయులు అక్కడికి వెళ్లాలని, పరిశోధనలు చేయాలని అన్నారు. తన ప్రసంగంలో ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ అంతరిక్ష పరిశోధనలపై దృష్టి సారించారని ఇస్రో చైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు.
