భారత్ 2047 కల్లా 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో గురువారం ప్రారంభమైన వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్‌లో ముఖేష్ అంబానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్ అభివృద్ధికి రిలయన్స్ సంస్థ కట్టుబడి ఉంటుందని, రిలయన్స్ ఎప్పటికీ గుజరాతీ కంపెనీ అని తెలిపారు. ఈ సందర్భంగా ముఖేష్ ప్రధాన మంత్రి మోడీకి కృతజ్ఞతలు చెప్పారు.
