ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న చిత్రం ‘హనుమాన్’. శుక్రవారం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ‘హనుమాన్ సూపర్ హీరో సినిమా. ఇందులో తేజ సజ్జానే సూపర్ హీరో. సినిమా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. హనుమాన్ మంచి ఎంటర్‌టైనర్ కానుంది.’ అని అన్నారు.
