మలేషియాకు చెందిన 112 ఏళ్ళ బామ్మ వరుడు కావాలని ప్రకటన ఇచ్చింది. దీంతో నెటిజన్లు అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పటివరకు ఏడు పెళ్లిళ్లు చేసుకున్న హావ హుస్సేన్ ఎవరైనా తనని ఇష్టపడితే పెళ్లిచేసుకుంటానని తెలిపింది. ఆమె ఇంత వయస్సు వచ్చినా కూడా తన పని తానే చేసుకుంటుంది. తాను చేసుకున్న ఏడుగురు భర్తల్లో నలుగురు చనిపోగా, మిగిలినవారికి విడాకులు ఇచ్చింది. ఈ బామ్మకు 5 మంది పిల్లలు, 19 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారని సమాచారం.
