బీజేపీపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మాది నిజమైన సెక్యులర్ పార్టీ. BJP మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటోంది. మేము కూడా యాదాద్రి అక్షింతలను పంచితే గెలిచేవాళ్లమేమో. కాంగ్రెస్, BJP బంధానికి 2 MLCలకు వేర్వేరుగా నోటిఫికేషన్ రావడమే నిదర్శనం. అమిత్ షాను రేవంత్ కలవగానే ఎన్నిక పద్ధతి మారింది. హైకోర్టుకు వెళ్లినా మాకు నిరాశే మిగిలింది’ అని అన్నారు.
