మన్యం న్యూస్ గుండాల: ఈసం సమ్మక్క మరణం న్యూ డెమోక్రసీ పార్టీకి తీరని లోటని గుండాల సర్పంచ్ న్యూ డెమోక్రసీ నాయకులు కోరం సీతారాములు అన్నారు. సమ్మక్క పార్థివదేహానికి నివాళులు అర్పించి అనంతరం ఆయన మాట్లాడుతూ. అనారోగ్యం కారణంతో సమ్మక్క మృతి చెందిందని భౌతికంగా మన మధ్యలో లేకపోయినా ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుందని అన్నారు. ఎందరో నాయకులతో ఉద్యమంలో కలిసి పనిచేసే పేద ప్రజల ఆశయ సాధన కోసం ఎంతో కృషి చేసిందన్నారు. ఈసం సమ్మక్క ప్రజల గుండెల్లో చిరస్వనీయంగా నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నరేష్, పరిశిక రవి, ఉప సర్పంచ్ ఉపేందర్, వై వెంకన్న, ఈసం కృష్ణ, ఎస్ కే అస్గర్ , రామచంద్రు తదితరులు పాల్గొన్నారు
