జనవరి 22న అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా రెండు వేల మంది ప్రముఖులకు ఆహ్వాన పత్రాలు అందాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులకు విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకులు గుర్రం సంజీవ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ శశిధర్ రావినూతల బృందం ఆహ్వాన పత్రాలు అందజేసింది. రామ్‌చరణ్ కూడా ఈ కార్యక్రమానికి సతీసమేతంగా హాజరవుతారు.
