ఆదిత్య హాసన్ దర్శకత్వంలో శివాజీ నటించిన ‘90స్-ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్‌సిరీస్ ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఈటీవీ విన్‌లో విడుదలైన ఈ సిరీస్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈజీగా కనెక్ట్ అవుతోంది. తాజాగా ఈ సిరీస్ 120 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని సూపర్ రెస్పాన్స్‌తో ముందుకు వెళ్తోంది. అలాగే ఐఎండీబీలో 9.8 రేటింగ్ సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ఇటీవల విడుదలైన మంచి సిరీస్‌లో ఇది ఒకటిగా నిలిచింది.
