బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బయోపిక్ త్వరలో పట్టాలెక్కబోతుంది. గంగూలీ పాత్రలో నేషనల్ అవార్డు విన్నర్ ఆయుష్మాన్ ఖురానా నటించనున్నాడు. ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా.. ఈ ఏడాది చివరల్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఖురానా.. గంగూలీ బ్యాటింగ్ ఆడే విధానం, తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు.