‘హనుమాన్’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. మొదటి షో పడినప్పటి నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోంది. దీంతో మహేష్ “గుంటూరు కారం”కి “హనుమాన్” నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుంది. ‘గుంటూరు కారం’ కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టే పరిస్థితికి దూసుకుపోయిందట. ప్రస్తుతం USAలో హనుమాన్ 500K డాలర్ల కలెక్షన్లు పొందగా.. ఇదే సమయంలో గుంటూరు కారం సినిమాకు 374K డాలర్ల కలెక్షన్లు వచ్చాయి.
