మన్యం న్యూస్ కరకగూడెం:ఆపదలో ఉన్న నిరుపేదలకు సేవ చేయాలనే ఆలోచన ప్రతీ ఒక్కరిలో రావాలని ‘ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’ సభ్యులు,కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా అన్నారు.ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా కరకగూడెం మండలంలోని నర్సంపేట,మోతె గ్రామాలకు చెందిన దొడ్డి సూర్యం,మెంతిని శంకర్ ల ఇళ్ళులు దగ్ధమయ్యాయి.విషయం తెసులుకొని ఆదివారం బాధిత కుటుంబాలకు ఫౌండేషన్ తరపున 50 కేజీల బియ్యం,నిత్యావసరాలు,దుస్తులు,దోమతెరలు,పిల్లలకు స్కూల్ బాగ్స్,నోట్ బుక్స్,స్టేషనరీతో పాటు 2వేల నగదును వారి వారు ఇళ్ల వద్ద అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సమాజంలోని పేదలకు సేవ చేయడం ప్రతీ ఒక్కరూ అదృష్టంగా భావించాలని అంతేకాకుండా సేవా భావంతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ వారి సేవలు రానున్న రోజుల్లో మరింత విస్తృతం చేస్తామని పేర్కొన్నారు.అలాగే పేదలకు ఎల్లప్పుడూ సాయపడడంమే తమ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశ్యంమని తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సమీర్,ఆరిఫ్, సాయి తదితరులు పాల్గొన్నారు.