సంక్రాంతికి తెలుగు ఇండస్ట్రీ నుంచి 4 సినిమాలు విడుదల అయ్యాయి. అందులో తేజా సజ్జ నటించిన ‘హనుమాన్’ సినిమాకి అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. బుక్ మై షోలో ఎంత ట్రై చేసినా టికెట్ దొరకడం లేదు. అటు మహేష్ బాబు ‘గుంటూరు కారం’ మూవీకి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. నిన్న రిలీజైన వెంకటేశ్ ‘సైంధవ్’ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కింగ్ నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ బాగుంది అని టాక్ వచ్చింది.
