మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత.. గతేడాది సినిమాలకు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటోంది. మునుపటి కన్నా.. ప్రస్తుతం సమంత ఆరోగ్యం మెరుగుపడినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమెకు నచ్చని విషయాన్ని చెప్పుకొచ్చింది. సమంతకు పూలంటే అలర్జీ అంట. వాటి వల్లే తాను ఎమర్జెన్సీ రూమ్‌కు వెళ్లిందని, ఈ పూలను చూస్తే భయం వేస్తుందని సమంత చెప్పింది. పువ్వులంటే ఇష్టపడే వాళ్లు ఉంటారు.. కానీ తనకు పూలంటే అస్సలు నచ్చదని వెల్లడించింది.
