పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రంపై ఓ క్రేజీ బజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకి ‘రాజా సాబ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి. ఇక రేపు ఈ సినిమా ఫస్ట్ లుక్ సహా టైటిల్‌ని మేకర్స్ రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాతో మాళవిక మోహనన్ టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.
