మెగాస్టార్ ఫ్యాన్స్‌కి శుభవార్త వచ్చేసింది. చిరంజీవి హీరోగా ‘మెగా 156’ అనే వర్కింగ్ టైటిల్‌లో కొత్త సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్‌ను సంక్రాంతి సందర్భంగా సోమవారం సాయంత్రం 5 గంటలకు రివీల్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. కాగా ఈ మూవీని ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్.
