త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ బాబు కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. జనవరి 12న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అభిమానులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయినప్పటికీ మూవీ క్రేజ్ తగ్గడం లేదు. ప్రస్తుతం ఈ సినిమాలో మహేశ్ బాబు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడనే విషయంపై నెటిజన్లు గూగుల్‌లో శోధిస్తున్నారు. రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
