టాలీవుడ్ నటి శ్రీలీల.. క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. నెలకొక సినిమాతో థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మాత్రమే ఉంది. ఈ సినిమా తర్వాత శ్రీలీల సినిమాలకు బ్రేక్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాప్‌లో తన చదువుపై దృష్టి పెట్టనుందని వార్తలు వస్తున్నాయి. కాగా, శ్రీలీల ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విషయం తెలిసిందే.
