సాధారణంగా దర్శకులు సినిమా స్టోరీ రాసే ముందు ఒక హీరోను ఊహించుకుని కథను రాస్తారు. ఆ తర్వాత హీరోకు వెళ్లి కథను చెప్తారు. డేట్స్ ఖాళీ లేకపోవడం, ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల హీరోలు ఆ సినిమాలను రిజెక్ట్ చేస్తుంటారు. హనుమాన్ సినిమా విషయంలోనూ అదే జరిగింది. ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాని నాచురల్ స్టార్ నానితో తీయాలనుకున్నారట. స్టోరీ విన్నప్పటికీ సున్నితంగా రిజెక్ట్ చేశాడట. ఈ విషయం తెలిసి పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు
