కాంగ్రెస్ పార్టీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోవర్టులు ఉన్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్(ఎక్స్)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 2018లో కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలో బీజేపీ గెలుపులో కాంగ్రెస్ కీలకపాత్ర పోషించిందన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చెప్పినట్లుగా ఇరు పార్టీలు మళ్లీ కలిసి పని చేయబోతున్నట్లు తెలుస్తోందని చెప్పారు.
