మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్న ‘చిరు 156’ సినిమా టైటిల్‌ను సంక్రాంతి పండుగ సందర్భంగా కాసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనిపై ఓ గ్లింప్స్ కూడా విడుదల చేసి సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశారు. పవర్‌ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆకట్టుకునే గ్రాండియర్ విజువల్స్‌తో ఈ టీజర్ అదిరిపోయింది.
