సూపర్‌స్టార్ మహేశ్ బాబు తాజా మూవీ ‘గుంటూరు కారం’ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా యూఎస్ఏలో 2 మిలియన్ మార్క్‌ను దాటగా.. ప్రిన్స్ కెరీర్‌లో ఈ ఘనత సాధించిన 5వ చిత్రంగా నిలిచింది. గతంలో శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సర్కారు వారి పాట చిత్రాలు ఈ ఘనతను అందుకోగా.. ప్రభాస్ తర్వాత ఈ రికార్డు సాధించిన హీరోగా సూపర్ స్టార్ నిలిచారు.
