ఈ నెల 22న అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అయోధ్యలోని సెవెన్ స్టార్ ఎంక్లేవ్‌లో ప్లాట్ కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై కేంద్రంగా పని చేస్తున్న రియాల్టీ డెవలపర్ ‘ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (హెచ్ఓఏబీఎల్) వద్ద అమితాబ్ ప్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్లాట్ సుమారు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుందని, దీని ధర రూ.14.5 కోట్లు ఉండొచ్చని సమాచారం.
